telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఐసీసీఆర్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీకి ఇఫ్లూ వీసీ సురేష్ కుమార్ నామినేట్‌

E Suresh Kumar

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఎఫ్‌ఎల్‌యూ) వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ. సురేష్ కుమార్ న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) సర్వసభ్య సమావేశానికి ఎంపికయ్యారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రొఫెసర్ సురేష్ కుమార్‌ను విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ సభ్యునిగా నియమించింది. జూలై 28వ తేదీన‌ జరిగిన ఐసిసిఆర్ పాలకమండలి సమావేశంలో ప్రొఫెసర్ సురేష్ కుమార్ ను ఎంపిక చేశారు. ఆయన పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది.

కేంద్రం నాపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు శాయశక్తుల కృషి చేస్తానని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూలో సురేష్ కుమార్ చెప్పారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఇ. సురేష్ కుమార్ విద్యాబాసం చేశారు. ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్ కావడంతో బదిలీల నేపథ్యంలో ఈ జిల్లాలో తెలుగు మీడియంలో ఉన్నత చదువులను చదివారు. 9, 10 తరగతులు ఖమ్మం జిల్లా పాల్వంచలో  పూర్తి చేశారు. డబుల్ ఏం ఎ, పీ హెడి ఉస్మానియా యునివర్సిటిలో పూర్తి చేశారు. 2014-16 లో ఉస్మానియా రిజిస్ట్రార్  గా బాధ్యతలు నిర్వహించారు.

Related posts