telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హిందువువా… ముస్లింవా ? అంటూ సారా అలీఖాన్ పై ట్రోలింగ్

Sara

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు, పటౌడి యువరాణి సారా అలీఖాన్ “కేదారనాథ్” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ బ్యూటీ నిత్యం ఏదో ఒక విషయంలో నెటిజన్ల ట్రోట్స్‌కు గురవుతున్నారు. ముస్లిం అయిన సారా కుటుంబం ప్రతి పండుగను జరుపుకుంటారు. అంతేగాక ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌చేస్తారు. ఈ క్రమంలో గురువారం గణేశ్‌ చతుర్థి సందర్భంగా వినాయకుడి వేడుకల వద్ద దిగిన ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీనికి ‘గణపతి బప్పా మోరియా’ అంటూ క్యాప్షన్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు కారణంగా సారాపై టోల్రింగ్‌ జరుగుతోంది. హిందూ పండగను జరుపుకోవడంపై కొంతమంది మండిపడుతున్నారు. ‘సారా.. ముస్లింవా లేక హిందు’వా అంటూ విరుచుకుపడుతున్నారు. దీంతో ట్రోలింగ్‌ కు సారా కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. అయితే సారా అభిమానులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక సారా సింబా, లవ్‌ ఆజ్‌కల్‌ వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన కూలీ నెం.1 సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

 

View this post on Instagram

 

Ganpati Bappa Morya 🙏🏻💐💗💞

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Related posts