స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని రైల్వే స్టేషన్ లో ఫోన్ చూస్తూ ట్రాక్ పై పడిపోయింది ఓ మహిళ. వెంటనే అక్కడికి ట్రైన్ వచ్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని సెకన్లలోనే ఘటన జరిగింది. ఇక్కడి ఓ మెట్రోస్టేషన్‌కు రైలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫ్లాట్ ఫాం మీదకు రైలు వస్తోందని విన్న ఓ యువతి.. మొబైల్ చూస్తూ ట్రైన్ వచ్చేసిందని భావించింది. దీంతో ట్రైన్ స్టేషన్‌లోకి ప్రవేశించడానికి సెకన్ల ముందుగా పట్టాలపై పడిపోయింది. ఇది చూసిన స్టేషన్‌లోని ప్రయాణికులు షాకయ్యారు. ఆమెకు సాయం చేయడానికి ముందుకెళ్లారు. కానీ అప్పటికే ట్రైన్ వచ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన మాడ్రిడ్ మెట్రో సంస్థ.. వీడియోలోని యువతికి చిన్నపాటి గాయాలే అయ్యాయని, ఆమె క్షేమంగానే ఉందని ట్వీట్ చేసింది.
⚠ Por tu seguridad, levanta la vista del móvil cuando vayas caminando por el andén.#ViajaSeguro #ViajaEnMetro pic.twitter.com/0XeQHPLbHa
— Metro de Madrid (@metro_madrid) 24 October 2019
బిగ్ బాస్-3 : రాహుల్ ప్రపోజ్ చేస్తే… పునర్నవి కామెంట్స్