telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

హ్యాపీ బర్త్ డే వరల్డ్ కప్స్ హీరో యువరాజ్…

Yuvraj

భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ నేడు తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. భారత జట్టు సాధించిన 2007, 2011 ప్రపంచ కప్ లలో ముఖ్య పాత్ర పోషించిన యువరాజ్ 2000లో భారత జట్టులోకి అరంగేట్రం చేసాడు. కానీ 2017 తర్వాత తనకు జట్టులో స్థానం దక్కకపోవడంతో 2019 వరల్డ్ కప్ జరుగుతోన్న సమయంలో .. జూన్ 10న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే 2011 ప్రపంచ కప్ లో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్ ఆల్‌రౌండర్ షో తో అదరగొట్టాడు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడటంతో కెరీర్ లో వెనుకంజ వేసాడు. కానీ మళ్ళీ తిరిగి జట్టులోకి వచ్చిన యువీ తన మార్క్ ను చూపించలేకపోయాడు. అయితే తన కెరీర్ లో మొత్తం 40 టెస్టుల్లో 1,900 పరుగులు, 9 వికెట్లు, 304 వన్డేల్లో 8,701 పరుగులు 111 వికెట్లు అలాగే 58 టీ20ల్లో 1,177 పరుగులు, 28 విఒకేట్లు సాధించాడు. అయితే ఈ మధ్య యువీకి మళ్ళీ పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ (పీసీఏ) నుంచి పిలుపు వచ్చింది… యువీ తాను ఇచ్చిన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకొని పంజాబ్ తరపున రంజీలో మళ్లీ ఆడాలని పీసీఏ కోరినట్లు వార్తలు వచ్చాయి. కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. కానీ యువీ తిరిగి వస్తే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts