telugu navyamedia
క్రీడలు వార్తలు

ద్రవిడ్‌ మా విధానాల్ని కొట్టాడు : చాపెల్‌

పటిష్టమైన దేశవాళీ టోర్నీల ద్వారా మెరికల్లాంటి క్రికెటర్లను గుర్తించి జాతీయ జట్టుకు అందించడంలో జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ ద్రవిడ్‌ కృషి ఎనలేనిదన్నారు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్‌ చాపెల్‌ అన్నారు. ఆసీస్ కంటే కూడా ద్రవిడ్‌ మెరుగైన ప్రతిభాన్వేషణ వ్యవస్థను రూపొందించాడని కంగారూల మాజీ సారథి ప్రశంసించారు. తాజాగా గ్రెగ్‌ చాపెల్‌ మాట్లాడుతూ… ‘రాహుల్ ద్రవిడ్‌ ఆస్ట్రేలియా విధానాల్ని ఎంచుకున్నాడు. అధిక జనాభా ఉన్న భారత్‌లో కంగారూల పద్ధతుల్ని ఆచరణలో పెట్టి అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు. యువ ఆటగాళ్లను గుర్తించి.. అవకాశాలు కల్పించడంలో ఆసీస్‌దే అత్యుత్తమ వ్యవస్థ. అయితే గత రెండేళ్లలో ఇది పూర్తిగా మారింది. అద్భుతమైన ప్రతిభావంతుల సమూహం అయోమయంలో ఉండటం చూస్తున్నా. ఇది ఆమోదయోగ్యం కాదు. ప్రతిభను గుర్తించడం.. అవకాశాలు కల్పించడంలో ఆసీస్‌ తన స్థానాన్ని కోల్పోయిందని భావిస్తున్నా. ఈ విషయంలో ఇంగ్లండ్, భారత్‌లు ఆసీస్‌ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి’ అని అన్నారు.

Related posts