telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇప్పడు మోదీలో భయం కనిపిస్తోంది: రాహుల్

rahul gandhi to ap on 31st

ప్రధాని నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. పార్లమెంటు లోపల, వెలుపల మోదీపై తాము పోరాటం చేశామని, ఇప్పడు మోదీలో భయం కనిపిస్తోందని రాహుల్ చెప్పారు. మోదీ గెలుస్తారని ఇప్పుడు ఎవరూ చెప్పడం లేదని అన్నారు. ఎవరి సూచనలు పట్టించుకోకుండా దేశాన్ని పాలిస్తే సక్రమంగా పాలన అందించ్లేదని చెప్పారు. ప్రజల అభిప్రాయం మేరకే తాను ముందుకు సాగుతానని అన్నారు.

కాంగ్రెస్ గెలిస్తే ప్రధాని ఎవరనే ప్రశ్నకు మే 23వ తేదీ తర్వాతే సమాధానం చెబుతానని తెలిపారు. రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తున్న శక్తులపై తాము పోరాడుతున్నామని చెప్పారు. ఆర్బీఐ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే పెద్ద నోట్లను మోదీ రద్దు చేశారని విమర్శించారు. పబ్లిక్ ఫంక్షన్లలో మోదీని తానుఎంతో గౌరవిస్తానని తెలిపారు. ఆయన మాత్రం తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరని అన్నారు. కేవలం ప్రసంగించడం, కామెంట్లు చేయడం మాత్రమే ప్రధాని బాధ్యత అనే విధంగా మోదీ వ్యవహరిస్తారని దుయ్యబట్టారు.

Related posts