telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

వేసవి సెలవుల పొడిగింపు.. జూన్‌ 12 నుంచి స్కూల్

english medium classes in kasturiba schools

తెలంగాణ రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలలకు సెలవులు పొడగించారు. వేసవి సెలవులు ముగించుకొని వచ్చే నెల 12 నుంచి ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్య అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ 1 నుంచే బడులు ప్రారంభం కావాల్సి ఉంది. వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్‌ 11 వరకు బడులకు సెలవులు పొడిగించాలని, 12 నుంచి బడులు తిరిగి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో జూన్‌ 4 నుంచి ప్రారంభం కావాల్సిన బడిబాట పై స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి జూన్‌ 1న బడులు ప్రారంభమవుతాయి కాబట్టి టీచర్లంతా 1 నుంచి 3 వరకు బడి బాట కార్యక్రమాలకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, 4 నుంచి బడిబాటను నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు పాఠశాలల పునఃప్రారంభం తేదీని 12కు వాయిదా వేయడంతో బడిబాటపై స్పష్టత రావాల్సి ఉంది. 

Related posts