telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కరోనా బీభత్సం..తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత వారం రోజులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్ 19 కేసులపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోవిడ్ టెస్టులు, చర్యలపై హైకోర్టు కు రిపోర్ట్ సమర్పించారు ఏజీ బీఎస్ ప్రసాద్. మార్చ్ 7, 11వ తేదీల్లో 20 వేల లోపు టెస్టులు మాత్రమే చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే… సొంతంగా సేరో సర్వేలెన్సు సర్వే చేయడానికి సమయం కావాలని కోరారు ఏజీ ప్రసాద్. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉన్నారని…రాష్ట్ర సరిహద్దులు, రైల్వే, బస్‌ స్టేషన్ లో 300 మొబైల్ బస్సులతో టెస్టులు నిర్వహిస్తున్నామని ఏజీ పేర్కొన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ గుంపులు, గుంపులుగా ఉండటంపై ఆంక్షలు విధించాలని.. అంత్యక్రియలు, పెళ్ళిల్లో 100 మందికి మించరాదని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు డైలీ బులెటిన్ ఇస్తున్నామని ఏజీ పేర్కొన్నారు.
రద్దీ ప్రాంతాల్లో, నిర్మాణ ప్రాంతాలు, స్కూల్ వద్ద టెస్టులు పెంచాలని..ర్యాపిడ్ టెస్టుల కంటే RTPCR టెస్టులు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. రాపిడ్, RTPCR టెస్టుల సంఖ్య వేర్వేరుగా ఇవ్వాలని.. కేంద్ర విడుదల చేసిన SOP పాటించాలని హైకోర్టు తెలిపింది. కోవిడ్ 19 కేసులపై విచారణ ఏప్రిల్ కి వాయిదా వేసింది హైకోర్టు.

Related posts