telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సుల్తాన్‌బజార్ : … విషజ్వరాల నేపథ్యంలో .. ఉస్మానియా ఆసుపత్రి ఓపీ సమయం పెంపు…

ou hospital op time extended upto 6

ఉస్మానియా దవాఖానలో విష జ్వరాలతో రోగుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో రెండు గంటల వరకు ఓపీ సమయాన్ని పెంచడంతో పాటు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఓపీని కొనసాగిస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ పేర్కొన్నారు. అదేవిధంగా దవాఖాన జనరల్ మెడిసిన్ విభాగాన్ని అప్రమత్తం చేసి రోగులకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

మే నెలలో 155 మంది విష జ్వరాలతో దవాఖానలో చేరగా 22 డెంగీ కేసులుగా నిర్ధారణ అయ్యాయని, జూన్‌లో 130విషజ్వరాలలో 15డెంగీ, జూలైలో 241 విషజ్వరాలలో 75 డెంగీ, ఆగస్టులో 385 విషజ్వరాలలో 96 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆయన వివరించారు. విషజ్వరాలతో వచ్చే వారికి ఉచితంగా డెంగీ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Related posts