telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు !!

బ్రతుకు భారం
ప్రతినిత్యం ఘోరం
ఆకాశాన ధరలు
పాతాళంలో ఆదాయం..
పేదవాడి సంసారం
వైకుంఠపాళి ఆటలు
నిత్యావసరాలకే సంపాదన
బతుకు బండి కష్టమయ్యే…
పెరుగుతున్న ధరలు
సామాన్యుడికి అందని ద్రాక్షాలు
నూనె ధరలు అంతకంతకూ
డీజిల్ పెట్రోల్ ఆకాశానికి…
ఉప్పు పప్పు కొనడం కష్టమే
ఏ వస్తువు ముట్టుకున్నా మంటలే
పెరగని ప్రవేట్ జీతాలు
విలవిలలాడుతున్న జనాలు..
కమ్మని భోజనం కరువయ్యే
పచ్చడి మెతుకులు కష్టమయ్యే
కంటికి నిద్ర దూరం అయ్యే
అలసిన శరీరానికి ఆయువు తగ్గే..
ఉచిత పథకాలతో ఆకర్షించి
ధరలు పెంచి మనిషినీ ఉరివేసిరి
సామాన్యుడి నడ్డి విరగ్గొట్టి
నడి బజారులో విసిరి వేసిరి..
ఒకరిమీద ఒకరు నెపం నెట్టుకుంటూ
రాజకీయ వినోదాలు చేస్తున్నారు
ధరల కు కళ్లెం వెయ్యకుండా
దగాకోరు మాటలతో హింసిస్తున్నారు..
అరచేతిలో వైకుంఠం చూపిస్తూ
ప్రజాస్వామ్యం బ్రష్టు పట్టిస్తూ
కుల మత వర్గ రాజకీయాలు చేస్తూ
అంగడి సరుకుల ఓటర్లను ఆకర్షిస్తున్నారు..
ధరల ఘాతానికి గుండె విలవిలలు
బ్రతకడమే భయంగా మారిన రోజులు
ధరలు తగ్గించే మార్గాలు ఎక్కడ
ఆలోచించని ప్రభుత్వాలే అక్కడ…

Related posts