telugu navyamedia
రాజకీయ వార్తలు

అవసరమైతే ప్రధాని ఇంటి వద్ద ధర్నా: అశోక్ గెహ్లాట్

Ashok gehalot rajasthan

రాజస్థాన్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాపై విమర్శలు గుప్పించారు. తనకు మెజారిటీ ఉన్నప్పటికీ అసెంబ్లీని సమావేశపరిచేందుకు గవర్నర్ జాప్యంపై గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశం అనంతరం గెహ్లాట్ మాట్లాడుతూ.. అవసరం అనుకుంటే ప్రధాని నరేంద్రమోదీ ఇంటి వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.

ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలుస్తామని అశోక్ గెహ్లాట్ అన్నారు. తమకు పూర్తి మెజారిటీ ఉందని, అసెంబ్లీని తక్షణం సమావేశ పరచాలని సీఎం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత తదుపరి వ్యూహాన్ని ఖరారు చేస్తామని గెహ్లాట్ పేర్కొన్నారు.

Related posts