telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అక్కడ కాలుష్యం వల్లే ప్రెగ్నెన్సీ మహిళలకు అబార్షన్లు…

revanthreddy campaign in huzurnagar

కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్‌ ఘటనపై తమకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ కాలుష్యం వల్ల ప్రెగ్నెన్సీ మహిళలకు అబార్షన్లు అవుతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.  ప్రెస్ మీట్ లో రేవంత్ మాట్లాడుతూ.. సచివాలయం కూల్చివేత, పునర్నిర్మాణంపై రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. శ్రీశైలం ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయాలని లేఖ రాశా.. శ్రీశైలం ప్రమాద ఘటనలో భాద్యులైన చర్యలు ఏవి? నది [పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై జయదేకర్ కు ఫిర్యాదు చేశా.. ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఫైర్ అయ్యారు. తెలంగాణను కెసిఆర్, కేటీఆర్ కాలుష్యం చేస్తున్నారని ఎన్నో లేఖలు రాశా.. ఇంత వరకు చర్యలు లేవు. ప్రకాష్ జయదేకర్ కి చిత్తశుద్ది ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. మూసీ ప్రాంతాల్లో టిఆర్ఎస్ గల్లీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. టిఆర్ఎస్ తప్పిదాలను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? అక్రమార్కులకు బీజేపీ ఎలా సాయపడుతుందో తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రం కోట్లు విడుదల చేస్తే కేటీఆర్ సన్నిహితులు అక్రమంగా దోచేశారని జయదేకర్ కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదన్నారు. బీజేపీ నాయకులను తయారు చేసుకోలేకనే కాంగ్రెస్ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కాళ్లపై పడుతోంది. జనసేనతో పొత్తు లేదంటూనే పవన్ కళ్యాణ్ మద్దతు కోరారని రేవంత్ పేర్కొన్నారు.

Related posts