అఖిలాండకోటి నాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి శ్రీమలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై వెన్నదొంగ కృష్ణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారికి సూర్యచంద్రులు రెండునేత్రాలు. ఉదయం సూర్యప్రభవాహనంలో ఊరేగిన స్వామి రాత్రికి.. చంద్రడి ప్రభతో వెలిగిపోతున్న వాహనంపై దర్శనమిచ్చారు.
పుష్ణామి చౌషధీః సోమో భూత్వా రసాత్మకః. రస స్వరూపుడైన చంద్రుడే ఔషధులను పోషిస్తున్నాడని అర్థం. శివుడికి శిరో భూషణం చంద్రుడు. చంద్రప్రభ వాహన దర్శనంతో అధ్యాత్మిక, అధి భౌతిక, అధి దైవికమనే మూడు తాపాల నివారణ అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
నా రూ.7500 ఎవరు మింగారు ?… కేటీఆర్ కు మాధవీలత షాకింగ్ పోస్ట్