telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ పోలీస్ లో .. మరో భారీ నియామకం ..

weekly off to telangana police also in 2 days

రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మరోసారి భారీగా నియామకాలకు కసరత్తు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఉద్యోగ ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. పోలీస్ శాఖలో 15 వేల పోస్టుల భర్తీ ప్రక్రియకు లైన్ క్లియరైంది. పోలీస్ శాఖలో త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ఉండబోతోందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం దానికి బలం చేకూరుస్తోంది. గతేడాది నోటిఫికేషన్‌కు సంబంధించి కూడా నియామక ప్రక్రియ జోరందుకుంది. పోలీసుశాఖలో మరో 15 వేల పోస్టులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా నోటిఫికేషన్ మొదలు నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) కసరత్తు చేస్తోంది.

గతేడాది జారీ చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి పోలీస్ నియామక ప్రక్రియను స్పీడప్ చేసింది. దానికి సంబంధించి ఫైనల్ స్టేజీ కూడా పూర్తయింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా పూర్తయింది. త్వరలోనే కటాఫ్‌ మార్కులు ప్రకటించనుంది బోర్డు. తద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియ చేపట్టే పనిలో బిజీగా ఉంది. అది కూడా పూర్తయితే పోలీస్ శాఖలోకి కొత్తగా 18 వేల 500 మంది కొత్తగా విధుల్లో చేరనున్నారు. అందులో 17 వేల 156 మంది కానిస్టేబుల్స్ కాగా మరో వేయి 275 మంది ఎస్సైలు ఉండనున్నారు. ఈసారి వెలువడనున్న నోటిఫికేషన్ లో మాత్రం.. 33 కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలనేది అధికారుల అంతరంగంగా కనిపిస్తోంది. నోటిఫికేషన్ కోసం అంతా సిద్ధం చేసేలోగా కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందనేది పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆలోచన. ఆ మేరకు 15 వేల ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టనున్నారు. అందులో 14 వేల కానిస్టేబుళ్లతో పాటు మరో వేయి వరకు ఎస్సై పోస్టులు ఉండవచ్చని తెలుస్తుంది.

Related posts