telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట‌క్ జ‌గ‌దీష్ నుండి నాని లుక్ రిలీజ్..

నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ.. ‘టక్ జగదీష్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్‌ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. షైన్ స్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే… సినిమా నుంచి మరో లుక్‌ రిలీజ్‌ అయింది. ఈ లుక్‌లో నాని కత్తి పట్టుకుని…క్లాస్‌ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఆ లుక్‌ చూస్తుంటే.. ఈ సినిమాలో ఫ్యాక్షన్‌ సీన్లు ఉండేలా కనిపిస్తోంది. అయితే.. నాని లుక్‌ తో పాటు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ అనౌన్స్‌ చేశారు. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నాని న్యూ లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Related posts