telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు సాంకేతిక

ఐఐటీ హైదరాబాద్ లో … కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)..

artificial intelligence in iit hyderabad

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్య లో బోధించే అంశాలలో కూడా మార్పులు ఎంతో అవసరం. దానిని బట్టే సదరు విద్యార్థులు వారి విద్యాబ్యాసాన్ని పూర్తీ చేసుకునేసరికే ఉద్యోగం సాధిస్తారో లేదో తేలిపోతుంది. అటువంటి పరిణతి విద్యాసంస్థలలో చాలా తక్కువనే చెప్పాలి. అయితే వీటిని అతీతంగా ఐఐటీ లు రూపుదిద్దుకోవడం విశేషం. అందుకే వాటిలో విద్యాబ్యాసానికి అందరూ ఉవ్విళ్లూరుతారు. ఇక మన హైదరాబాద్ ఐఐటీ లో కృత్రిమ మేధ రానున్న రోజుల్లో మానవ జీవితాల్లో కీలక పాత్ర పోషించనుంది. దీని ద్వారా వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, నిఘా, రక్షణ రంగాల్లో పెనుమార్పులు సాధ్యమవుతాయి. ఇప్పటికే చాలా సంస్థలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ)ను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-హైదరాబాద్‌’ బీటెక్‌లో పూర్తిస్థాయి కృత్రిమ మేధ కోర్సును అందుబాటులోకి తెస్తోంది. జేఈఈ-అడ్వాన్స్డ్‌ ద్వారా ఏటా 20 మందికి ఈ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. 2019-2020 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఐఐటీ, హైదరాబాద్‌ కేంద్రంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పరిశోధనలకు చక్కటి వాతావరణాన్ని సృష్టించడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యమని ఐఐటీహెచ్‌ సంచాలకులు ఆచార్య యూబీ దేశాయ్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts