బాహుబలి చిత్రంలో భళ్ళాలదేవ పాత్రతో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రానా దగ్గుబాటి తెలుగులో “విరాట పర్వం” అనే సినిమాతో రానా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌లో భాగంగా తెరకెక్కుతున్న “హౌస్‌ఫుల్-4” చిత్రంలో పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు జోడీగా పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు జోడీగా కృతి కర్బంద నటించారు. ఫర్హాద్ సంఝీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందట. 1419, 2019 మధ్య కాలంలో సాగే ఈ కథలో రానా కాళకేయ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా హౌజ్‌ఫుల్ 4 చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇందులో రానా గెటప్ ప్రేక్షకులకి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. 1419 కాలం నాటి రాజ్యాన్ని కూల్చే పాత్రని రానా పోషిస్తున్నాడు. ఎంతో క్రూరంగా కనిపిస్తూ తన పాత్రపై ఆసక్తి కలిగిస్తున్నాడు. ఈ సినిమాతో రానాకి హిందీలో మరింత క్రేజ్ పెరగడం ఖాయమని అంటున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post
next post
కంగనాపై కామెంట్స్ తో షాకిచ్చిన అలియా