telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

బంగాళాదుంప పై పేటెంట్ రచ్చ : లేస్ చిప్స్ .. స్వచ్చందంగా బహిష్కరించాలి .. రైతులు

pepsi co case on farmers aloo production

దేశంలో కొత్తకొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. బహుళజాతి సంస్థలు మరీ ఎక్కువగా ప్రజల జీవితాలను శాసిస్తున్నాయి. దీనితో కడుపు మండిన రైతులకు అండగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కదులున్నారు. ఎందుకంటే…మన రైతులపై కూల్ డ్రింకులు అమ్మే సంస్థ పెప్సీకో దావా వేసింది. లేస్ చిప్స్‌లో వాడే ఆలుగడ్డలను పండించినందుకు అంటూ వారిని కోర్టుకు ఈడ్చింది. లేస్‌ చిప్స్ తయారు చేసే ఆలుగడ్డలపై కంపెనీకి ‘కాపీ రైట్ ‘ హక్కులున్నాయని కాబట్టి ఎవరూ ఆ ఆలుగడ్డలను పండించొద్దని పేర్కొంటూ…గుజరాత్ రైతులను కోర్టుకు ఈడ్చింది. గుజరాత్ రైతులు పండిస్తున్న రకం ఆలుగడ్డలను తాము రిజిస్టర్ చేసుకున్నామని, కాబట్టి ఏ రైతూ వాటిని వాడడానికి వీల్లేదని పెప్సికో కోర్టులో కేసు వేసింది. ఈ నెలలో ఇప్పటికే పెప్సికో ఇండియా.. గుజరాత్ లో రూ.4.2 కోట్లకు కేసు వేసింది. అహ్మదాబాద్ సివిల్ కోర్టు ఆ కేసును విచారించింది. ఈ రకం ఆలుగడ్డలను పండించబోమని, ఇప్పుడు పండించిన వాటిని నాశనం చేస్తామని ఒప్పుకుంటేనే కేసు వాపసు తీసుకుంటామని చెప్పారు. లేదంటే పెప్సికోతో ఒప్పందం చేసుకుని పంటను నేరుగా సంస్థకే అమ్మాలని తేల్చి చెప్పారు. కేసులో భాగంగా మొక్కల రకాల రక్షణ, రైతు హక్కుల చట్టం 2001లోని సెక్షన్ 64ను కోర్టుకు పెప్సికో గుర్తు చేసింది. రైతులు పండించడం ఆపేస్తే కేసును వెనక్కు తీసుకుం టామని పెప్సికో తరఫు లాయరు కోర్టుకు వివరించారు.

పేటెంట్‌లోని మొక్కల రకాల రక్షణ, వాడకం, విత్తడం, మార్పిడి వంటివి రైతులు చేసుకోవచ్చని చెప్పే అదే చట్టంలోని సెక్షన్ 39ను రైతుల తరఫు లాయర్ ఎత్తి చూపారు. పెప్సికో ఆఫర్ పై ఆలోచించుకునేందుకు కొంత టైం కావాలని రైతుల తరఫు లాయరు చెప్పడంతో కోర్టు జూన్ 12కు కేసును వాయిదా వేసింది. రైతులను కార్పొరే ట్లు ఎలా దోచుకుంటున్నారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేస్ చిప్స్, పెప్సికో ఆలుగడ్డ ఉత్పత్తులను నిషేధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ తరఫున కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. నేషనల్ జీన్ ఫండ్ ద్వారా కోర్టులకయ్యే ఖర్చులను భరించాలని కోరారు. రైతులకు హక్కులపై అవగాహన ఉండదని భావించే ఇలాంటి కేసులు వేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఎంఎన్‌సీ కంపెనీకి షాకిచ్చేలా లేస్ చిప్స్‌ను ప్రజలెవరూ వాడవద్దనే పిలుపు మేరకు పలువురు స్వచ్ఛందంగా వాటికి దూరంగా ఉంటున్నారు.

Related posts