telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

గుడ్‌న్యూస్‌ : భారీగా పడిపోయిన పసిడి ధరలు

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.720 తగ్గడంతో రూ. 50,010కు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరగడంతో రూ. 45,900కు చేరుకుంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 650 తగ్గడంతో రూ. 47,730 కు చేరుకుంది… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 తగ్గడంతో రూ. 43,750 పలుకుతోంది. అటు వెండి ధర మాత్రం మాత్రం కాస్త పెరిగింది. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ. 72,600గా నమోదైంది.

Related posts