telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం.. వైద్య సిబ్బందికి రెట్టింపు వేతనాలు

Manohar Lal Khattar after returning from foreign trip

వైద్యసిబ్బందికి హర్యానా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కోవిడ్‌-19 సేవల్లో నిమగ్నమై ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు, అంబులెన్స్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రెట్టింపు జీతాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని వైద్యులు, మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి ఆయుర్వేద విభాగాల అధికారులతో నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం సీఎం ఈ ప్రకటన చేశారు.

వేతనాలను రెట్టింపు చేయనున్నట్లు తెలిపి సిబ్బందిలో స్ఫూర్తి నింపారు. విపత్తుపై సైనికుల్లా పోరాడుతున్న వైద్యులకు, సిబ్బందికి కరోనా విపత్తు నుంచి పూర్తిగా బయటపడే వరకు ఈ విధానం కొనసాగుతుందని సీఎం ప్రకటించారు. తాజాగా హర్యానా రాష్ట్రంలో నిన్నటివరకు 154 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు.

Related posts