telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ లో పెరుగుతున్న యూకే స్ట్రెయిన్ కేసులు…

చైనా నుండి వచ్చిన కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. అయితే ఇదే సమయంలో యూకేలో పురుడు పోసుకున్న కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది… భారత్‌లోనూ ఈ కేసులు క్రమంగా వెలుగుచూస్తున్నాయి… ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయగా… డిసెంబర్‌ నెలలో యూకే నుంచి, యూకే మీదుగా భారత్‌కు వచ్చిన వారి మీద ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలు ఆ ప్రయాణికులను గుర్తించి టెస్ట్‌లు చేస్తున్నారు.. అయితే, భారత్‌లో మరి కొందరికి కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ సోకినట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. దీంతో, ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 38కి పెరిగింది. ఇందులో 19 కేసులు ఢిల్లీలోనే నమోదు అయ్యాయి.. బెంగ‌ళూరులో 10, హైద‌రాబాద్‌లో 3, పుణెలో 5, బెంగాల్‌లోని క‌ళ్యాణిలో 1 కేసు నమోదైంది. హైదరాబాద్ కింద చూపిస్తున్న 3 కేసులు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవి.. తెలంగాణలో రెండు కేసులు, ఏపీలో ఒక కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త స్ట్రెయిన్ బారినపడ్డవారినంతా ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. చూడాలి మరి ఇది ఎప్పుడు తగ్గుతుంది అనేది.

Related posts