telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రేపు మద్యం దుకాణాల బంద్

MLC Elections 3 days closed Liquor shops

ఈ నెల 19న హనుమాన్‌ జయం తిని పురస్కరించుకుని శోభాయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నగరపోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఇతర అధికారులతో కలిసి శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు.  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1,200 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు.

ర్యాలీ నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 వరకు నగరంలోని మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు తదితరాలు మూసి ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. రిజిస్టర్డ్‌ క్లబ్బులు, స్టార్‌ హోటల్స్‌లో ఉన్న బార్లకు మినహాయింపు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

 

Related posts