telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

విద్యార్థులకు శుభవార్త…ఒంటిపూట బడులకు రంగం సిద్ధం !

ఎండాకాలం వచ్చేసింది. రోజు రోజుకు ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏటా మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే తరగతులు నిర్వహించేవారు… అయితే కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌, ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు, ఫిబ్రవరి 24 నుంచి 6, 7,8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించారు. ఇటీవలే 6, 7, 8 తరగతుల వారికి బోధన ప్రారంభం కావడం, వసతులు సరిపోకపోవడంతో 2500 పాఠశాలు షిఫ్ట్‌ పద్దతిలో తరగతులను నిర్వహిస్తున్నారు. 200పై చిలుకు పాఠశాలల్లో ఇంటర్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్కూళ్లు రెండు పూటలా నడిచే అవకాశంలేకపోవడంతో ఒంటిపూట నడపడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు.

Related posts