telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సారానికి గానూ తెలంగాణ బడ్జెట్‌ విలువ రూ. 2,30,825.96 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు కాగా.. ఆర్థిక లోటు అంచనా రూ. 45, 509.60 కోట్లు, మూల‌ధ‌న వ్య‌యం రూ. 29.046.77 కోట్లు అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు హరీశ్‌రావు. ఏడేళ్ల తెలంగాణ తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్ర‌గ‌తిలో అధిగ‌మించిందని..ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను ప్ర‌భుత్వం నెర‌వేరుస్తోందన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ అగ్ర‌భాగాన నిలిచిందని.. నిర్దేశిత ల‌క్ష్యాల‌ను నిర్దిష్ట స‌మ‌యంలో పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. స‌మ‌స్య‌లు, స‌వాళ్లు అధిగ‌మిస్తూ ప్ర‌గ‌తి ప‌థాన ప‌య‌నిస్తున్నామని..క‌రోనా వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిందన్నారు. రాష్ర్టంలో క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపిందని హరీష్‌రావు పేర్కొన్నారు.

Related posts