telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జీతాలు తగ్గించే అధికారం ప్ర‌భుత్వానికి ఉంటుంది..

ఏపీ హైకోర్టు సోమవారం నాడు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్ ను విచారణ చేయడం కోసం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ కు పంపుతామని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.జీతాలు పెంచే అధికారం, అలాగే తగ్గించాలి ప్రభుత్వాలకు ఉంటుందని ఏపీ హైకోర్టు.

పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సోమవారం విచారించింది. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీతాలు పెంచే అధికారం, అలాగే తగ్గించాలి ప్రభుత్వాలకు ఉంటుందని ఏపీ హైకోర్టు.

ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఉద్యోగులకు వేతనాలివ్వాలని, పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన గెజిటెడ్ ఆఫీసర్స్ .జెఎసీ నేత కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం నాడు మధ్యాహ్నం కీలక ఆదేశాలు జారీ చేసింది.

కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పండని పిటిషన్‌ దారులను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి సమాచారం లేకుండా పిటిషన్‌ ఎలా వేస్తారని , అసలు ఎంత జీతం తగ్గిందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించాలని హైకోర్టు సూచనలు చేసింది.

అయినా పీఆర్సీని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. స్టీరింగ్ కమిటీలో ఉన్న 12 మంది సభ్యులు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. అంతేగాకుండా..పిటిషనర్ కూడా హాజరు కావాలని వెల్లడించింది.

Related posts