నేరాలు చేయడంలో ప్రతిపక్ష నేత జగన్ ఎక్స్‌పర్ట్ అని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం నర్సీపట్నం ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల మన కష్టాన్ని తెలంగాణ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు. అన్నదాత సుఖీభవను కౌలు రైతులకూ వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఆనందంగా ఉండేవరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
వైసీపీ అధికారంలోకి వస్తే ఊరికో రౌడీ ఉంటారని చెప్పారు. వైఎస్ విజయలక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేస్తే, పులివెందుల నుంచి రౌడీలు వచ్చారని విమర్శించారు. జనం అందుకే అక్కడ తిప్పికొట్టారన్నారు. జగన్ లాంటి నాయకుడుంటే ఏపీకి పెట్టుబడులు రావని అన్నారు. కోడికత్తి పార్టీ వల్ల ఎవరికైనా లాభం ఉందా? అని అడిగారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో భద్రత ఉండదన్నారు.