టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సంస్థల పై మండిపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకా హత్యకేసులో మొదటినుంచి సాక్ష్యాలను తారుమారుచేసి తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని ఆరోపించారు. మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. సాక్షి టీవీ… ఓ పనికిమాలిన టీవీ అని దుయ్యబట్టారు. ఆ మీడియా ద్వారా గుండెపోటని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారని అన్నారు.
వివేకా నిజంగానే గుండెపోటుతో పోయారని నేను కూడా నమ్మాను, సంతాపం తెలియజేశాను. అక్కడ్నించి అందరికీ అనుమానాలు వచ్చేశాయి. గాయాలు కనిపించిన తర్వాత కూడా దాన్ని గుండెపోటు మరణం అని చెప్పగలిగారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవాలి. ఈ వ్యవహారంలో చివరికి సీఐ కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ జగన్ మోహన్ రెడ్డి మైండ్ గేమ్ లు ఆడుతాడని విమర్శించారు.
ఏపీ లాంజ్ కోసం చంద్రబాబు రూ.17 కోట్లు.. దర్యాప్తు జరగాలి!: విజయసాయిరెడ్డి