telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ప్రభుత్వం క్రీడలను పట్టించుకోవడం లేదు: శాప్ మాజీ చైర్మన్

jagan

ఏపీ సీఎం జగన్ పై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న 35వ నేషనల్‌ జూనియర్‌ అథ్లెటిక్స్ క్రీడలకు హాజరైన క్రీడాకారులు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల విషయంలో చంద్రబాబు శ్రద్ధ తీసుకునేవారని ప్రశంసించారు. ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన 32వ జాతీయ క్రీడలు ఓ మైలురాయిగా నిలిచిపోయాయని కొనియాడారు. జాతీయ స్థాయిలో ఏపీ ప్రతిష్ఠ పెరగడానికి అదే కారణమన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక కూడా చంద్రబాబు క్రీడలకు పెద్దపీట వేశారని మోహన్ అన్నారు. క్రీడాకారులను చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహించిందని, ప్రతీ నియోజకవర్గంలో మినీ స్టేడియాల నిర్మాణానికి కృషి చేసిందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన వారిని ప్రభుత్వం ప్రోత్సహించిందని, పీవీ సింధుకు రూ.3 కోట్ల నగదుతోపాటు గ్రూప్‌-1 ఉద్యోగం, రాజధానిలో ఇంటి స్ధలం కేటాయించి గౌరవించిందని మోహన్ వివరించారు.

Related posts