telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. ఆటోల్లో అధిక ఛార్జీల వసూలు

auto pasangers

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కారణంగా ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రుల సమీపంలో మరి అధిక చార్గీలు వసూలు చేసి ప్రయాణీకుల నడ్డీ విరుస్తున్నారు. దీంతో రోగులపై ప్రయాణం భారం విపరీతంగా పడుతోంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని రోగులు తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆటో యజమానులు ఆటో ఎక్కితే చాలు రూ.100 అంటూ దబాయిస్తున్నారు.

గాంధీ ఆస్పత్రి నుంచి ఉప్పల్‌కు వెళ్లాలంటే రూ.200 అడుగుతున్నారు. బేగంపేట్‌ రసూల్‌పురకు చెందిన ఖయూం ఖాన్‌ కాళ్లు విరిగి ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాడు. తిరిగి బేగంపేట్‌ రసూల్‌పురకు వెళ్లేందుకు ఓపీ ఎదురుగా ఉన్న ఆటోలను ఆశ్రయించాడు. ఒకరు రూ.250, మరొకరు రూ.200 చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా వందల్లోనే చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ఆటో డ్రైవర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

Related posts