telugu navyamedia
సినిమా వార్తలు

గుడ్ లక్ సఖి ట్రైలర్ విడుద‌ల‌..

కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త‌ సినిమా ‘గుడ్ లక్ సఖి’. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెర‌కెక్కించిన  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రైఫిల్‌ షూటర్‌ పాత్రలో కీర్తి సురేష్‌, కోచ్‌ పాత్రలో జగపతిబాబు నటించారు.

ఈ సినిమా జనవరి 28న థియేటర్లలోకి రానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్ వేగ‌వంతం చేశారు చిత్ర‌యూనిట్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గుడ్ లక్ సఖి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

ట్రైలర్ చూస్తే… మ‌న దేశం గర్వపడేలా షూటర్స్‌ను తయారు చేయ‌బోతున్నాన‌ని జ‌గ‌ప‌తిబాబు డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది. అయితే మ‌న మ‌ధ్య‌లో గొప్ప షూట‌ర్ ఉంది సార్ అంటూ అమ్మాయి సఖిని ఆది పినిశెట్టి పరిచయం చేస్తాడు. అందరూ నన్ను బ్యాడ్ లక్ సఖి అంటుంటారు… అట్టాంటి సోది కబుర్ల మీద నమ్మకం లేదంటూ కీర్తి సురేష్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

రైఫిల్ షూటింగ్‌లో ఎటువంటి నేప‌థ్యం లేని ఆ అమ్మాయి కోచ్ దగ్గరకు వెళ్లినప్పుడు లక్ష్యం మీద కాలుస్తుంది. కోచింగ్ తీసుకుని పోటీలకు వెళ్లినప్పుడు ఆమె గుర్తి తప్పుతుంది.

ఇందులో గిరిజిన యువతిగా కీర్తి సురేశ్ నటించింది. షూటింగ్​లో ఓనమాలు తెలియని ఓ యువతి.. జాతీయ స్థాయి షూటర్​గా ఎలా ఎదిగింది? ఎలా అనేది క‌థ సారాంశం.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌) సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మించిన ఈ సినిమాకు శ్రావ్యా వర్మ సహ నిర్మాతగా వ్య‌వ‌హారిస్తున్నారు.

Related posts