telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌ విద్యార్థులతో సురేష్ బాబు సినిమాలు

Suresh

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు రెండు కొత్త చిత్రాలను ప్రకటించారు. సతీష్ త్రిపుర, అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఈ రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలకు దర్శకత్వం వహించే డైరెక్టర్లు రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులు కావడం విశేషం. సతీష్ త్రిపుర చిత్రం క్రైమ్ థ్రిల్లర్ కాగా, అశ్విన్ గంగరాజు చిత్రం ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఆయా చిత్రాల నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో వెల్లడిస్తారు. సురేష్ ప్రొడక్షన్ సంస్థ నుండి ఈ ఏడాది ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం సురేష్ బాబు వెంకటేష్‌తో ‘నారప్ప’ సినిమాను నిర్మిస్తున్నారు.

Related posts