న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా ‘శ్యామ్ సింగ్ రాయ్’ . ఇందులో నానికి జతగా సాయి పల్లవి, కృతి శెట్టి నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బిగ్ సక్సెస్‌తో దూసుకుపోతున్న నాని మరో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఆసక్తి రేపుతోంది. ఈ షూటింగ్‌ను ఆదివారంతో పూర్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ, ఓ వీడియో పోస్ట్ చేశారు నాని. దీనికి ఇది రోలర్ కోస్టర్ మూవీ ఆఫ్ ది ఇయర్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు నాని.
ఈ సినిమాలో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో నజ్రియా నజీమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని.. వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు.
It’s a wrap for the roller coaster movie of the year ♥️#AnteSundaraniki pic.twitter.com/1Kq27vtPF9
— Nani (@NameisNani) January 23, 2022
“ఛీఛీ… నేను మాట్లాడటమేంటి?…” నాగబాబు కామెంట్స్ పై బాలయ్య రియాక్షన్