telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మైండ్ బ్లాక్” చేస్తున్న వార్నర్

warner

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. టిక్ టాక్‌లో త‌న భార్య‌తో క‌లిసి ప‌లు వీడియోలు చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తున్నారు. మ‌హేశ్ బాబు‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌కు సంబంధించిన పార్ట్‌1ను ఈ రోజు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు శుక్ర‌వారం తెలిపాడు. అన్న‌ట్టుగానే కొద్ది సేప‌టి క్రితం వీడియో విడుద‌ల చేశాడు. ఇందులో త‌న భార్య‌తో క‌లిసి వార్న‌ర్ చేసిన డ్యాన్స్‌.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. 50 టేకుల త‌ర్వాత ఇది సాధ్య‌మైంది అని కామెంట్ పెట్టాడు. మ‌హేష్ ఫ్యాన్స్‌ని వార్న‌ర్ డ్యాన్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. టాలీవుడ్‌ హీరోలను అనుకరిస్తూ వార్న‌ర్‌ చేసిన టిక్‌టాక్‌ వీడియోలు ఎంత హైలైట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుట్టబొమ్మ సాంగ్‌, పొకిరి డైలాగ్‌, బాహుబలి సాంగ్‌కు తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు వార్నర్‌.

Related posts