telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ బొద్దుగుమ్మే ఈ ముద్దుగుమ్మ… వీడియో వైరల్…!

Sara

సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ “కేదారానాథ్” చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాల‌లోకి రాక‌ముందు ఈ అమ్మ‌డు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో విద్య‌న‌భ్య‌సించింది. ఆ స‌మ‌యంలో పీసీవోడీ కార‌ణంగా దాదాపు 96 కిలోల బ‌రువు ఉండేది సారా. త‌ల్లి సూచ‌న‌ల మేర‌కు జిమ్‌లో రెగ్యుల‌ర్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ నాజూగ్గా త‌యారైంది. ఫిట్‌నెస్ ట్రైన‌ర్ న‌మ్ర‌తా పురోహిత్ వ‌ల‌న తాను స్లిమ్‌గా అయిన‌ట్టు సారా పేర్కొంది. చ‌దువుకునే స‌మ‌యంలో తాను ఎలా ఉండేదో వీడియో ద్వారా చూపించింది సారా. ఈ వీడియోని చూసి నెటిజ‌న్స్ షాక్ కావ‌డంతో పాటు తెగ షేర్ చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు తొమిదిన్న‌ర ల‌క్ష‌ల‌కి పైగా నెటిజ‌న్స్ ఈ వీడియోని లైక్ చేశారు. సారా ప్ర‌స్తుతం యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌తో కలిసి “లవ్‌ ఆజ్‌కల్‌” సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆమె తండ్రి సైఫ్‌ అలీఖాన్‌ నటించిన “లవ్‌ ఆజ్‌కల్‌”కు సీక్వెల్‌ కావడం విశేషం. సైఫ్ అలీఖాన్- దీపికా పదుకొనే జంటగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఆజ్ కల్ అప్పట్లో ఎంతటి సంచలన సృష్టించిందో అందరికి తెలిసిందే. కంప్లీట్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా సైఫ్-దీపికా మధ్య రొమాంటిక్ సన్నివేశాల్లో అప్పట్లో ఓ సంచలనం.

Related posts