telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ పరిస్థితుల్లో షూటింగ్ లలో పాల్గొనకపోవడమే ఉత్తమం : నిత్యామీనన్

Nitya

టాలెంటెడ్ హీరోయిన్‌గా ప్రత్యేకతను చాటుకున్న హీరోయిన్లలలో ఒకరుగా నిత్యామీనన్ పేరు సంపాదించుకుంది. అలాగే గ్లామర్ విషయంలో తనకంటూ కొన్ని పరిధులు విధించుకుని, వాటికి కట్టుబడే సినిమాలు చేస్తుంది. నిత్యామీనన్‌కు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే.. ఆమెను ఒప్పించడం చాలా కష్టం. ఇక విషయానికొస్తే… రెండు నెలల తరవాత లాక్ డౌన్ లో సడలింపులు చేయడంతో సినిమా షూటింగ్ లు తిరిగి మొదలవుతున్నాయి. కానీ కొంతమంది నటీనటులు మాత్రం కరోనాకు భయపడి షూటింగ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ నిత్యామీనన్ ను మీరు ఎప్పటినుండి షూటింగ్ లో పాల్గొంటున్నారు? అని ప్రశ్నించగా… ఆమె మాట్లాడుతూ “ప్రస్తుతం నా చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఈ సంవత్సరం చివరిదాకా నేను షూటింగ్స్ లో పాల్గొనాలి. కానీ కరోనా వల్ల షూటింగ్ లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ లలో పాల్గొనకపోవడమే ఉత్తమం అని నా అభిప్రాయం. షూటింగ్ లో పాల్గొన్నప్పుడు సామాజిక దూరం పాటించడం కష్టం మాట్లాడుకోకుండా ఉండలేం. అందుకే నాకు షూటింగ్ లో పాల్గొనాలని ఎలాంటి తొందరా లేదు. అయితే రెండు మూడు రోజుల్లో షూటింగ్ ముగుస్తుందంటే షూటింగ్ లో పాల్గొంటాను” అని తేల్చి చెప్పేసింది.

Related posts