telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సీత” యాక్షన్ ట్రైలర్… స్టంట్స్ తో అదరగొడుతున్న కాజల్

Sita

తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం “సీత‌”. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఈ చిత్రంలో సోనూసూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా మంచి స్పందన లభించింది. మే 24న విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జ‌రుపుకుంటుంది. తాజాగా చిత్రానికి సంబంధించి యాక్ష‌న్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో కాజ‌ల్ స్టంట్స్ ప్రేక్ష‌కుల‌కి ఆశ్చ‌ర్యాన్ని కలిగిస్తున్నాయి. అనీల్ సుంక‌ర నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ అద్భుత‌మైన సంగీతం అందించారు. మరి మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts