కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా సెట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. డైరెక్టర్ శంకర్ కూడా గాయపడినట్లు సమాచారం. ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటనపై నటి కాజల్ అగర్వాల్ స్పందించారు. ‘‘ఈ ఘటనపై నేను ఎంత బాధపడుతున్నానో చెప్పడానికి మాటలు రావడంలేదు. నా ముగ్గురు కొలీగ్స్‌ను కోల్పోయాను. వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా ముగ్గురు స్నేహితుల ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్న రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో వెంట్రుక వాసిలో నేను తప్పించుకున్నాను కాబట్టి ఇప్పుడు ట్వీట్స్ చేయగలుగుతున్నాను. సమయం, జీవితం గురించి పెద్ద గుణపాఠాలే నేర్చుకున్నాను’ అని తెలిపారు. ఈ ఘటనపై కమల్ హాసన్ కూడా ట్వీట్ చేసారు.
Words cannot describe the heartache I feel at the unexpected,untimely loss of my colleagues from lastnight.Krishna,Chandran and Madhu.Sending love,strength and my deepest condolences to your families.May god give strength in this moment of desolation. #Indian2 @LycaProductions
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 20, 2020