లాక్ డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోయాయి. దీంతో టీవీ నటులు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పట్లో జాతీయస్థాయిలో ప్రసారమైన హిందీ సీరియల్ ‘సాథ్ నిభానా సాథియా’ సీరియల్ లో నటించిన వందన విత్లానీ ఇప్పుడు రాఖీలు అమ్ముకుంటోంది. ఈ సీరియల్ ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ పేరిట తెలుగులోనూ విశేషమైన ప్రజాదరణ పొందింది. ఇందులో కీలకపాత్రలో నటించిన వందన విత్లానీ కరోనా పరిస్థితుల్లో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం షూటింగులు నిలిచిపోవడంతో తన వద్ద ఉన్న డబ్బు అయిపోయిందన్నారు. తనకు తెలిసిన విధంగా రాఖీలు తయారుచేస్తూ వాటిని ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా విక్రయిస్తున్నానని తెలిపారు. ఇప్పుడు వాటిపై వచ్చే ఆదాయమే తనకు ఆధారమని వందన వెల్లడించింది. వందన భర్త విపుల్ కూడా టీవీ నటుడే..లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉపాధి లేక ఆయన కూడా ఇంటికే పరిమితమయ్యారు.