telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

గేదెకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించినందుకు పోలీస్ కేస్…

కొందరు తమ చుట్టూ ఉండే మనుషుల కంటే పశు పక్షులను ఎక్కువగా ప్రేమిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఆ ప్రేమ మరి ముదిరి పెంచుకున్న జంతువులకు కూడా పుట్టినరోజు, శ్రీమంతం వేడుకలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తున్నారు.  అలా పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, ఇటీవలే మహారాష్ట్రలోని థానే జిల్లాలోని డొంబివిలి ప్రాంతానికి చెందిన కిరణ్ మాత్రే అనే వ్యక్తి  ఓ గేదెను ప్రేమగా పెంచుకుంటున్నాడు.  ఆ గేదెకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని భావించాడు.  అంతే కరోనాను సైతం లెక్కచేయకుండా ఊరుమొత్తాన్ని పిలిచి గేదెకు పుట్టినరోజు వేడులకు నిర్వహించాడు.  అయితే, ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.  కరోనా ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో ఒక చోట గుమిగూడటంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు.  స్పందించిన పోలీసులు హుటాహుటిన వేడుకలు జరుగుతున్నా ప్రాంతానికి వచ్చారు.  కరోనా నిబంధలు గాలికి వదిలేసి వేడుకలు జరుగుతుండటంతో సెక్షన్ 229 కింద కేసులు బుక్ చేశారు.

Related posts