లాక్‌డౌన్ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాజేంద్రనగర్‌లో చిరుత రెండు సార్లు అందరినీ కలవరపెట్టింది. తాజాగా… కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది. గత రెండు నెలలుగా పలు గ్రామాల్లో చిరుత సంచరిస్తోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పద్మాజివాడి క్రాస్ రోడ్ నుంచి గాంధారికి వెళుతుండగా అతని కారుకు అడ్డంగా చిరుత వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు చిరుతను ప్రత్యక్షంగా చూసి భయాందోళనకు గురయ్యారు. అప్పటి నుంచి ఆ చుట్టు పక్కల ఉండే వారు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అటు మహబూబ్ నగర్ లోని దేవరకద్ర మండలం వెంకటాయపల్లి శివార్లలో కూడా చిరుత కలకలం రేపింది. వ్యవసాయ పొలం వద్ద వెంకటయ్య అనే రైతు కు చెందిన ఆవు దూడ పై దాడి చేసి చంపింది చిరుత. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత జాడ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
previous post