దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల వేదికగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. దావోస్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దావోస్‌లో బిజీబిజీగా గడిపేశారు. తమ రాష్ర్టాలకు పెట్టబడులను ఆకర్షించేందుకు పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా కలుసుకున్న ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకుని..ఆప్యాయంగా పలకరించుకున్నారు.
విదేశీ గడ్డపై ఏపీసీఎం జగన్‌తో కలిసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది అంటూ మంత్రి కేటీఆర్ రాసుకొచ్చారు. అయితే వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాలపై చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
కాగా.. పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ వరుసగా సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి.
Had a great meeting with my brother AP CM @ysjagan Garu pic.twitter.com/I32iSJj05k
— KTR (@KTRTRS) May 23, 2022

