లాక్ డౌన్ నేపథ్యంలో రోజువారి వేతనం పొందే కార్మికులు, వలస కార్మికులు నానా అవస్థలూ పడుతున్నారు. వారికి అండగా నిలిచేందుకు పలువురు సెలబ్రిటీలు, సేవా సంస్థలు ముందుకు వచ్చాయి. యాక్టర్ జగపతిబాబు ఇటీవల సినీ కార్మికులకు స్వయంగా బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసరాలను అందించారు. అలాగే కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ని పకడ్భందీగా నిర్వహిస్తున్న పోలీసులకి గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి ఎన్–95 మాస్కులు, శానిటైజర్లను అందించారు. తాజాగా జగపతి బాబు రోజువారి వేతనం పొందే సినీ కార్మికులతో పాటు ఆకలితో అలమటించే పదివేల మందికి నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్స్ అందించారు. జగపతిబాబు ఔదార్యంపై ప్రశంసలు వర్షం కురుస్తుంది. ఇక ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతగానో అలరించిన జగపతి బాబు ప్రస్తుతం విలన్‌గా, సపోర్టింగ్ పాత్రలలో కనిపించి అలరిస్తున్నాడు.
next post