telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పుష్ప” కోసం బాలీవుడ్ విలన్ ?

Pushpa

అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్‌లో తన 20వ సినిమాగా ‘పుష్ప’ అనే చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్టులుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ రోజంతా ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కలపదొంగగా బన్నీ కనిపించనున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. బన్నీ ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుకుంటున్నారు. లాక్ డౌన్ తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ విజయ్ సేతుపతి కాదని తెలుస్తోంది. అతడు పోలీస్ ఆపీసర్‌గా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. దీంతో విలన్‌గా బాలీవుడ్‌కు చెందిన హీరోను తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కనిపించనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం సంజయ్ దత్ .. జాకీ ష్రాఫ్ .. సునీల్ శెట్టి పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నారట. ఈ ముగ్గురిలో ఒకరిని ఆయన ఫిక్స్ చేయనున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

Related posts