telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కలల రాణి…

kalala rani poetry corner
నాచెలి వదన దీపం
వెలుగు పూలు పూస్తుంది
నా జాబిలమ్మ కనులలో
వెండి వెన్నెల కురుస్తుంది
నా సఖి అధరాల పాలకడలిలో
అమృతం ఉద్భవిస్తుంది
నా ‘కలల రాణి’కరుణించి
 కళ్లెదుట నిలిసింది
తన వెంట నవ వసంతం
తీసుకొని వచ్చింది
వలపుల వానై 
నా గుండెల్లో కురిసింది
క్రొత్త ప్రేమలోకంలోనికి 
నను తీసుకెళ్లింది
మధురానుభూతులను పంచింది
నా హృదయమెంతో మురిసింది
-గద్వాలసోమన్న, ఎమ్మిగనూరు

Related posts