telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ !!

lockdown corona

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.09 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 13,193 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 97 మంది మృతి చెందారు.  అటు మహారాష్ట్రలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రాష్ట్రంలో రోజుకు 3వేల కేసులు నమోదవుతున్నాయి. తొలివారంతో పోలిస్తే 14 శాతం అధికంగా కరోనా కేసులు నమోదవుతుండడం…నగరవాసులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. కరోనా వైరస్‌ విజృంభణలో మూడు నగరాల్లో లాక్‌ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. మహారాష్ట్రలోని విదర్భ రిజియన్‌లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో యావత్మాల్‌ జిల్లాలో పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది.   కరోనా విజృంభణతో విదర్భ ప్రాంతంలో విద్యా సంస్థలను మూసి వేశారు. మరోవైపు ముంబైలో కూడా లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలిస్తోంది ఉద్దవ్‌ సర్కార్‌. 

Related posts