telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘పుష్ప’ లో మరో భామ…!

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌ పాత్ర ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం మారేడుపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇక తదుపరి షెడ్యూల్ గా కేరళ వెళ్లనుందట పుష్ప బృందం. అయితే సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి కూడా భారీ అంచనాలున్నాయి. సుకుమార్ దర్శకత్వం కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇది ఇలా ఉండగా..ఈ చిత్రంలో హీరోయిన్ మేఘా ఆకాష్ బన్నీకి చెల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్
అందుకుంటున్న మేఘాకి ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించే నటుడితో లవ్ ట్రాక్ కూడా ఉంటుందట. ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ‘అల వైకుంటపురములో’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అల్లుఅర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ లొకేషన్స్ వేటలో ఉన్నాడు సుకుమార్. 

Related posts