telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లిఖిత పూర్వక ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తాం: సీఈసీ

CEC Review meeting AP Officers

సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ అధికారులతో సీఈసీ సునీల్ అరోరా సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్వేలు చేస్తూ ఓట్లు తొలగిస్తున్నారని ఆ విషయం తమ దృష్టికి తీసుకొచ్చారని సీఈసీ చెప్పారు. పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని కొన్ని అభ్యంతరాలు చెప్పారన్నారు. ఎన్నికల దృష్టిలోనే కొన్ని బదిలీలు జరిగాయని ఫిర్యాదులు అందాయన్నారు. ప్రస్తుత డీజీపీపై లిఖిత పూర్వక ఫిర్యాదులు రాలేదని.. వస్తే పరిశీలిస్తామని ఆయన అన్నారు.

మహిళా ఓటర్లకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారని, అంతకు ముందే ఉన్న పథకంలో భాగంగా చెక్‌లు ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఫిర్యాదులు వచ్చిన చోట్ల ర్యాండమ్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు సునీల్ అరోరా అన్నారు. కులాల ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కుదరదని ఆయన స్పష్టం చేశారు.ఈవీఎంలు దుర్వినియోగం అయినట్టుగా ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదని సీఈసీ సునీల్‌ అరోరా అన్నారు. ఆర్టీజీస్ ద్వారా జరిగిన సర్వే అంశాన్ని ఏపీ ఎన్నికల అధికారి పరిశీలించి విచారణ చేస్తారని ఆయన చెప్పారు.

Related posts