telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నరేంద్ర మోడీ బయోపిక్… టైటిల్ ఖరారు

narendra-modi-and-vivek-oberoi

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. బయోపిక్ లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో చాలామంది దర్శక నిర్మాతలు ప్రముఖుల బయోపిక్ లు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ జీవితం ఆధారంగా సినిమాను నిర్మించేందుకు బాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఈ బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే వంటి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రంలో మోదీ పాత్ర కోసం ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించినట్టు సమాచారం.

తాజాగా ఈ చిత్రానికి “పీఎమ్ నరేంద్ర మోదీ” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. ఈనెల 7న సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈనెల 2వ వారం నుంచి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ బయోపిక్ లో నరేంద్ర మోడీ సాధారణ జీవితం నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని స్థాయికి ఎలా ఎదిగారు ? ఈ స్థాయికి రావడానికి ఆయన చేసిన కృషి, ఆయనలో ఉన్న పట్టుదల, లక్ష్యసాధన వంటి విషయాలన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు.

Related posts