వైసీపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీది రంగుల రాజ్యం అని విమర్శించారు. ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే వేస్తున్నారని మండిపడ్డారు. మతం మార్చుకున్న జగన్.. కులాన్ని ఎందుకు వదలటం లేదని ప్రశ్నించారు. మతం మార్చుకుంటే ఇంకా కులం ఉండకూడదని వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ క్రిస్టియన్ అయితే ఏసులో ఉన్న సహనం, క్షమ గుణాలు ఆయనలో ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. జగన్‌కు ఓట్ల కోసం కులం, మతం, డబ్బు కావాలని దుయ్యబట్టారు. తాను ఓడిపోయాను కానీ పడిపోలేదని వ్యాఖ్యానించారు. వేల కోట్లు సంపాదించుకుని సిమెంట్ కంపెనీలు పెట్టుకోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ పేర్కొన్నారు.