telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కూతురితో పాట పాడుతూ… హ్యాండ్ వాష్ నేర్పిస్తున్న డ్వేన్ జాన్సన్

rock

ప్రపంచమంతా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలు కరోనా ప్రభావంతో వణికిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డ్వేన్ జాన్సన్ తన ఏడాది వయస్సు ఉన్న కుమార్తె టియానాకు నేర్పించాడు. బయట కరోనా రక్కసి ఉంది తల్లీ.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలంటూ మోనా మూవీ నుంచి పాట పాడుతూ సరదాగా నవ్వించాడు.కుమార్తె టియానాతో కలిసి హ్యాపీ బర్త్ డే పాట పాడుతూ చిన్నారి చేతులను శుభ్రంగా కడుగుతున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశాడు జాన్సన్. 47ఏళ్ల ఫాస్ట్, ఫ్యూరియస్ నటుడు జాన్సన్..మోనా మూవీ నుంచి ‘యూఆర్ వెల్ కమ్’ పాట పాడుతూ స్నానానికి ముందు కుమార్తె టియానాకు చేతులను శుభ్రంగా కడుక్కోవాలో నేర్పించాడు. తండ్రీకూతుళ్లు చేతులు కడుగుతూ సరదాగా గడిపిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసి చేశాడు.

Related posts